రూ.28 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ: మండలంలోని బుద్దికొండ జీపీపరిధి రాజులతాండలో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రూ.28 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజులతాండకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, తాండ నుంచి పొచ్చర వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.