🔥 TRENDING चौप ग्राम पंचायत में कैलाश जी इंदौरा न... ದೆಹಲಿಯಲ್ಲಿ ಡಿಸೆಂಬರ್ 01ರಂದು ಕಾರ್ಮಿಕ ಸಂಘ... MP NEET PG Counselling 2026 Paused Aft... ABVP to hold 'Kolkata Chalo' rally on... EC asks Bengal election judges to prov... West Bengal Unveils Proposed Industria...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బొరిగాంలో రూ.3.30 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 03:18 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నెరడిగొండ మండలంలోని బొరిగాం గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 3 కోట్లతో గుట్ట సైడ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ అనంతరం నూతనంగా నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలను ప్రారంభించారు. అదేవిధంగా రూ. 10 లక్షలతో మహిళ సంఘ భవన నిర్మాణానికి, రూ. 10 లక్షలతో కమ్యూనిటి హల్ నిర్మాణానికి, అదేవిధంగా రూ. 10 లక్షలతో జగదాంబ దేవి ఆలయానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... గ్రామంలో వర్షపు నీరు రాకుండా రూ. 3 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. అదేవిధంగా సమాజ సభ్యులకు సౌకర్యాల కొరకు రూ. 10 లక్షలతో కమ్యూనిటీ హల్, మహిళ అభివృద్ధి కొరకు రూమ్ 10 లక్షలతో మహిళ సంఘ భవనం సైతం నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని దానిని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులందరు ఐక్యంగా, ప్రేమతో ఉండాలన్నారు. బొరిగాం గ్రామానికి పూర్తిగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఎలాంటి గొడవలకు తావు లేకుండా గ్రామమంత కలసి ఉండాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ వినేశ్, ఉప సర్పంచ్ సంగీత బాయి, మాజీ సర్పంచ్ పవన్, పండరీ, రవీందర్ రెడ్డి, శివారెడ్డి, శ్రీకాంత్, జీవన్, రాథోడ్ సురేందర్, భూషణ్, మెర్సింగ్, మున్న నాయక్, చరణ్ నాయక్, నాయక్, కరొబారి, డావ్, గెరియా, గంగారాం తదితరులు ఉన్నారు.
📲Get App