🔥 TRENDING एक महीने में बुजुर्ग महिला पर दूसरी बा... India-US Trade Deal Could Speed Up Due... Andhra Pradesh: Britannica Provides In... India Urged to Re-evaluate Stance on I... Constitution Day Celebrated Across Ind... વલસાડમાં 'બાળ મેળો-2026'નું ભવ્ય આયોજન
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి పంచాయతీ ఎన్నికల్లో పార్టీల మధ్య పోటాపోటీ సర్పంచ్ స్థానాల్లో వైసీపీకి నాలుగు, టీడీపీకి మూడు.. గూడెంకొత్తవీధిలో సీపీఎం అభ్యర్థి విజయం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 27 Nov 2026, 09:04 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెంకొత్తవీధి మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మండలంలోని పలు పంచాయతీల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రెబల్ అభ్యర్థులు కూడా విజయం సాధించారు. గూడెంకొత్తవీధి పంచాయతీలో సీపీఎం మద్దతుతో పోటీ చేసిన అంపురంగి బుజ్జిబాబు 842 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థిపై 162 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.పంచాయతీల వారీగా చూస్తే దామనపల్లి, లకవరపుపేట, గాలికొండ, ధారకొండలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించగా, పెదవలస, దేవరాపల్లి, ఏ. ధారకొండలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. సంకడా, సీలేరు పంచాయతీల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. గూడెంకొత్తవీధిలో సీపీఎం, దుప్పులవాడలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.రింతాడలో జనసేన రెబల్ అభ్యర్థి, గుమ్మిరేవులులో వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించడం ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం సర్పంచ్ స్థానాల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ నాలుగు, టీడీపీ మూడు, జనసేన రెండు స్థానాలు సాధించగా, సీపీఎం, కాంగ్రెస్, జనసేన రెబల్, వైఎస్సార్‌సీపీ రెబల్ అభ్యర్థులు ఒక్కో స్థానం దక్కించుకున్నారు.ఇక వార్డు సభ్యుల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఐదు, టీడీపీ నాలుగు, జనసేన నాలుగు స్థానాలను గెలుచుకున్నాయి. మొత్తంగా మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రంగా పోటీ చేసిన రెబల్ అభ్యర్థులు తమ విజయాలతో స్థానిక రాజకీయాల్లో ప్రాతినిధ్యం సంపాదించారు.
📲Get App