🔥 TRENDING भाजपा जालौन ने सोशल मीडिया जिला सह-संय... सरसों में 400 रुपए की तेजी, कपास भी 30... The Rock Surprises Fans with Survivor... Ramayana Producer Names Sunny Deol as... Timberwolves Exit Film Review Session... Haryana GST Officer Arrested in Briber...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జిల్లా అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి అధికారులకు కలెక్టర్ టి. నిశాంతి ఆదేశం.. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 07:01 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి, ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ కార్యక్రమాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె పలు సూచనలు చేశారు.జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి సూచికల్లో వెనుకబడిన అంశాలను గుర్తించి వాటి పురోగతిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పులు కనిపించేలా పనిచేయాలని స్పష్టం చేశారు.వైద్య, పోషకాహార రంగాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు పెంచాలని సూచించారు. గిరిజన రైతులకు ప్రకృతి వ్యవసాయం, ఉద్యాన పంటలు, అరకు కాఫీ సాగు, పశుసంవర్ధక రంగాల ద్వారా ఆదాయాన్ని పెంచే అవకాశాలు కల్పించాలన్నారు.
అలాగే మారుమూల గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్, బీమా సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడాలని, ప్రభుత్వ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను శాఖల సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. గిరిజన ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అధికారులంతా సమష్టి బాధ్యతతో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
📲Get App