🔥 TRENDING जालौर में शुक्रवार को पंचायत राज चुनाव... Apple Secures Multiyear Memory Deals A... Telangana BJP Reassesses MLC Campaign... Telangana Board Sets March 2027 IPE Ex... Shanaya Kapoor Dismisses Viral 'Everyb... Congress Criticises Modi for Referenci...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దాబా (బి)లో ఘనంగా ఆసరా పింఛన్ పత్రాల పంపిణీ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 19 Nov 2026, 04:42 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: మండలంలోని దాబా (బి) గ్రామంలో గురువారం ఆసరా పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ఆసరా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆసరా పింఛన్లు పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.
పింఛన్ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, గ్రామస్తులు, మాజీ సర్పంచ్, ఆసరా పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
📲Get App