🔥 TRENDING Black Sea ''ਚ 3 ਵਪਾਰਕ ਜਹਾਜ਼ਾਂ ''ਤੇ Dro... Five Victims of Naushehra Pannuan Road... Kaziranga Bus Owner Arrested After Pro... UAE Residents Pay Respects at Funeral... बदायूं के रीसौली गांव में नाबालिक लड़क... Varanasi Team Teases Major Announcemen...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి రెండో వార్డులో జనసేన అభ్యర్థిగా నాడెల సత్యారావు పోటీ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల్లోకి.. గెలిపించాలని జనసేన శ్రేణుల విజ్ఞప్తి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 16 Nov 2026, 07:59 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జీకే వీధి గ్రామపంచాయతీ రెండో వార్డు సభ్యుడిగా జనసేన పార్టీ తరఫున నాడెల సత్యారావు పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా వార్డు అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణం, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో నాడెల సత్యారావును భారీ మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను కోరారు.
📲Get App