🔥 TRENDING आंधी‑तूफान से धान की फसल को भारी नुकसा... Meerut में अरबपति स्पोर्ट्स कारोबारी क... हजारीबाग के कटकमदाग थाना क्षेत्र में द... ટાયર ફાટી ગયેલાં ડમ્પર ચલાવતા ડ્રાઈવર... एटा में स्कूल बंद आदेश के बावजूद कई स्... રાજકોટમાં બ્લિંકિટથી કાકડીની નબળી ગુણવ...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఎన్నికల విధులపై పీవోలు, ఏపీవోలకు శిక్షణా తరగతులు నిర్ణీత సమయానికి హాజరుకావాలి: ఎంపీడీవో రమణబాబు

✍️ Reporter: LAMMASINGI RAJU 🗓 30 Oct 2026, 08:33 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధులకు నియమితులైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమణబాబు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీవోలు) ఈ శిక్షణకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
ఎన్నికల విధివిధానాలు, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విధుల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పీవోలకు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు, ఏపీవోలకు ఎల్లుండ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.మండల పరిషత్ కార్యాలయం పక్కన ఉన్న వెలుగు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది నిర్ణీత సమయానికి హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
📲Get App