🔥 TRENDING રાજકોટમાં બ્લિંકિટથી કાકડીની નબળી ગુણવ... Ayushmann Khurrana's 'Udta Teer' Holds... Kuki Organization Announces 48-Hour St... हापुड़में रातभर लगातार बारिश, मौसम का... Two Kuki-Zo Boys Missing in Manipur's... சென்னை: நவம்பர் 1 முதல் மழை முன்னறிவிப...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రింతడ–2లో సాగిన భీమేష్‌ ప్రచార జోరు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీటీసీ అభ్యర్థి హామీ

✍️ Reporter: LAMMASINGI RAJU 🗓 30 Oct 2026, 08:13 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం రింతడ పంచాయతీ సెగ్మెంట్-2లో ఎంపీటీసీ అభ్యర్థి సాగిన భీమేష్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాగిన భీమేష్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యత అని తెలిపారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు, రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App