🔥 TRENDING સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી... માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની... पूर्णियां पुलिस ने गुप्त सुचना पर करवा... खागी केजीसीएन खोज Tiger Shroff Set to Resume Filming Pos... Tamil Nadu CM Vijay to Inaugurate New...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

భువనగిరి పట్టణంలో సాధన హై స్కూల్ లో సురక్షిత్ బచ్ పన్ అభియాన్ జాతీయ కార్యక్రమం

✍️ Reporter: SRINIVAS 🗓 29 Oct 2026, 10:28 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భువనగిరి పట్టణంలో సాధన హై స్కూల్ లో సురక్షిత్ బచ్ పన్ అభియాన్ జాతీయ కార్యక్రమంలో భాగంగా భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫ్ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి, భువనగిరి యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్. ఐ. యుగంధర్, న్యాయ సహాయ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్, ప్యానెల్ లాయర్ ఎ. మల్లేష్, చైల్డ్ లైన్ సిబ్బంది దశరథ పాఠాశాలలోని విద్యార్థిని, విద్యార్థులకు పోక్సో చట్టాలు, బాలల హక్కులు, సైబర్ నేరాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, న్యాయ సహాయం అర్హతలు 15100, చైల్డ్ లైన్ 1098 వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ బాలికలపై ఎవరైనా లైంగిక నేరాలకు పాల్పడితే, పోక్సో చట్టం క్రింద కఠినమైన శిక్షలు అమలు చేయబడతాయని, బాల్యం ఎంతో విలువైందని, ఆ బాల్యాన్ని వెట్టి చాకిరి పేరిట వారి భవిష్యత్తు అంధకారం చేయొద్దని, సంఘంలో ప్రతీ బాలురు, బాలికలు సెల్ ఫోన్ల వాడకంలో సోషల్ మీడియపై జాగ్రత్త వహించాలని, చుట్టుతా చెడు కల్పించేవారిపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా చెడు భావనతో చూస్తే అట్టి సమాచారం ప్రధానోపాద్యాయులకు కాని తమ తల్లి, తండ్రికి కాని తెలియచేయాలని, తద్వారా దానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు.
విద్యార్థిని, విద్యార్థులకు వక్తృత్వ పోటీలను నిర్వహించి న్యాయమూర్తి విద్యార్థులకు మెమెంటోలను అందచేసారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ జిట్టా దనాప రెడ్డి , ప్రిన్సిపాల్ జిట్టా సంగీత, ఇంచార్జి ప్రిన్సిపాల్ రవి , పాఠశాల సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
📲Get App