🔥 ट्रेंडिंग బేల: కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి బేల: కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి బేల: కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి Mla Mehran Malik Delivers power full s... વલસાડના પારડીમાં બોટ પલટી: બચાવ કામગીર... Veteran actress Meethu Mukherjee dies...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ వద్ద పోలీసుల బందోబస్తు.. ఎస్పీ పర్యవేక్షణ

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 03:10 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ.. అనుమతి లేకుండా ఎవరినీ ఘటన స్థలంలోకి అనుమతించవద్దని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆధారాలు, భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రిమ్స్‌ను సందర్శించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. రిమ్స్ ప్రధాన ద్వారం, ఘటన స్థలం, ఆసుపత్రి పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.
📲Get App