🔥 ट्रेंडिंग औरैया में घरेलू गैस सिलेंडर का व्यावसा... ધારીમાં 25 લાખ રૂપિયાનો ખર્ચ, પંચાયત ભ... વડોદરાની GERIમાં સંશોધન અધિકારી અને સિ... કોટડા પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, ઉત... નારોલ પોલીસ સ્ટેશન દ્વારા ન્યુ મુસ્કાન... ઓવરસ્પીડ કાર ઇસ્કોન બ્રિજ પર ડાયવર્ઝન...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం

✍️ रिपोर्टर: Shri Abdul Rahiman 🗓 15 सित. 2026, 01:08 PM 👁 20
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

సెప్టెంబర్ 14న తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో తిరుపతి నుండి తిరుమల వరకు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించబడింది, భద్రతా చర్యలు సమగ్రంగా సమీక్షించబడ్డాయి.

సెప్టెంబర్ 14న తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో తిరుపతి నుండి తిరుమల వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించబడింది. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా భద్రతా ఏర్పాట్లను ముందస్తుగా సమీక్షించి, అవసరమైన చర్యలను చేపట్టారు.

తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్న మార్గాలు, ప్రాంతాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు తదితర ప్రాంతాలను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా తిరుమలలో జేఈవో శ్రీ చ. వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు, టిటిడి సీవీ & ఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఐపీఎస్., గారు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, భద్రతా ప్రోటోకాల్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు.
📲Get App