🔥 TRENDING IND Vs PAK: TEAM INDIA ਨੂੰ ਮਿਲਿਆ 314 ਦ... 4.20 करोड़ रुपए की लागत से आलनपुर सर्क... विकसित भारत यंग लीडर्स डायलॉग्स व यूथ... रियल एस्टेट कानून और अधिकारों की जानका... ଦେବଗିରି ସାଂସ୍କୃତିକ ଅନୁଷ୍ଠାନ ବୁଢ଼ୀପଦରରେ... फ्रेमवर्क फर्टिलाइजर प्रणाली से उर्वरक...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్: తండాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం.. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 22 Nov 2026, 07:39 PM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
తండాల్లో గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం.. 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం.

మహబూబాబాద్ జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాల నియంత్రనే లక్ష్యంగా పోలీసులు ఆదివారం మరిపెడ, మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహించారు.
మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రపు తండా, మంచా తండాల్లో ఎస్ఐ వెంకన్న సిబ్బందితో కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. గుడుంబా తయారీలో ఉన్న ముగ్గురిని గుర్తించారు. సుమారు 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 25 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.మహబూబాబాద్ టౌన్ పరిధిలోని బాబు నాయక్ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించి, నంబర్ ప్లేట్లు లేని ఐదు ద్విచక్ర వాహనాలు, 25 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. తండా పెద్దలతో సమావేశమై సైబర్ నేరాలు, మోటార్ వాహన నిబంధనలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు.
అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, గుడుంబా వంటి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ప్రజలు అక్రమ కార్యకలాపాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు..
📲Get App