🔥 ट्रेंडिंग ರಾಜ್ಯಾದ್ಯಂತ ವಕೀಲರ ಮೇಲೆ ಹತ್ಯೆ, ಹಲ್ಲೆ ಖಂ... सियासी बदलाव: पूर्व हलका प्रभारी रवि म... राहुल गांधी ने बड़वानी की छात्रा का मु... मुख्यमंत्री रेखा गुप्ता ने संत परमानंद... सुपौल में पत्रकार पर जानलेवा हमला पीड़... રામપીર મંદિરની દાનપેટીમાંથી 5000 રૂપિય...
03 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో ఎన్నికల బందోబస్తుపై పోలీసుల సమీక్ష 150 మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు.. అధికారుల దిశానిర్దేశం

✍️ रिपोर्टर: Reporter RAJU 🗓 03 नव. 2026, 10:54 AM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరిసీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల బందోబస్తుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మొత్తం 150 మంది సిబ్బందిని కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో చింతపల్లి ఎస్‌డీపీఓ నిరంజన్ ఐపీఎస్, జీకే వీధి సీఐ, మహిళా డీఎస్పీ, ఎస్సై సురేష్‌తో పాటు ఏఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది, సీఆర్‌పీఎఫ్ బలగాలు, ఏఎన్‌ఎస్ పార్టీలతో కలిసి సుమారు 60 మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని ఏఎస్పీ దిశానిర్దేశం చేశారు.
📲Get App