ఆదిలాబాద్:నవంబర్ 1న రైతు గర్జన సభకు కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న డైట్ మైదానంలో రైతు గర్జన సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా కరువు జిల్లాగా ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.