🔥 ट्रेंडिंग दीपावली पर विद्युत विभाग के कर्मचारियो... Supporter kashmir Pandit mr Nazir Ahm... AI से तस्वीरों की छेड़छाड़, फर्जी खबरो... બેચરાજીમાં વશ્વુધરા ફાઉન્ડેશનમાં મફત ક... मालोली हैशर बाजार के C.H.C में लगातार... A warm memorable oc Asian celebrating...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దీపావళి కానుకగా గిరిజన కుటుంబాలకు RPG ఫౌండేషన్ నిత్యావసర సరుకుల పంపిణీ

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 07 नव. 2026, 11:12 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: దీపావళి పండుగ సందర్భంగా సిరికొండ మండలంలోని సుంకిడి, లెండిగూడ, కొండాపూర్ తదితర 39 గిరిజన గ్రామాల ప్రజలకు RPG ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో మండలాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించడంతో గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన RPG ఫౌండేషన్ సభ్యులు మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. పండుగ వేళ ఆపన్నహస్తం అందించి గిరిజన కుటుంబాల్లో ఆనందం నింపారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన RPG ఫౌండేషన్ సభ్యులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేళ్లు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App