🔥 TRENDING BJD’s Stance on Delimitation Bill Amid... લીલીયા અમરેલી માર્ગ પર મોડી રાત્રે બે... DMK's Delimitation U‑Turn Upsets Congr... ‘Shaadi Mubaarak Ho Part 2’ premieres... Dev’s ‘DeSu7’ to Stream on SonyLIV fro... Kevin Pietersen dons a gamcha and spea...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మున్సిపల్ చైర్మన్‌పై ఆర్.బి. న్యూస్ అసత్య ఆరోపణలు..!

✍️ Reporter: Burra Kirankumara 🗓 29 Nov 2026, 08:50 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నా ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదు – న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా: మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్


భూపాలపల్లి: తనపై ఆర్.బి. న్యూస్ ఛానల్‌లో ప్రసారమైన కథనాన్ని భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ తీవ్రంగా ఖండించారు. తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, వాస్తవాలను తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధులపై వార్తలు ప్రసారం చేసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవడం, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను పరిశీలించడం మీడియా సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు.

తనపై జరుగుతున్న ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని బుర్ర కొమురయ్య గౌడ్ స్పష్టం చేశారు.

తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రసారం చేయవద్దని ఆయన హెచ్చరించారు.
📲Get App