🔥 TRENDING શામલી ગામે પરંપરા બદલી: તેરાવા પર ભોજન... उरई Agra में शादियों के मौसम से सड़कें जा... ज्योतिष विज्ञान के माध्यम से लोगों की... New Film 'Hey Kannamma' Teases Audienc... Rajasthan High Court Lowers Mental Hea...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కళ్యాణదుర్గంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నూతన శాఖ ప్రారంభోత్సవం

✍️ Reporter: Kande Linga Prasad 🗓 25 Nov 2026, 04:46 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అనేక రకాల రుణ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని విజయవాడ సర్కిల్ డీజీఎం, సర్కిల్ హెడ్ కవితా ఫ్రాంక్ తెలిపారు. బ్యాంకు అందిస్తున్న రుణ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. బుధవారం కళ్యాణదుర్గం పట్టణంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 84వ నూతన శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ దైవప్రసాద్ రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలనతో నూతన శాఖను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీఎం కవితా ఫ్రాంక్ మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ తరహాలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం పట్టణంలోని ప్రతి బజారులో, ప్రతి ఇంటిలో ప్రజలకు సుపరిచితమైన బ్యాంకుగా ఎదగాలన్నది తమ లక్ష్యమన్నారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన కళ్యాణదుర్గంలో రైతులకు విస్తృత రుణ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. ఎకరాకు సుమారు రూ.లక్ష చొప్పున పంట రుణాలు అందిస్తున్నామని, అర్హత, సిబిల్ స్కోరు ఆధారంగా భూమి విలువలో 50 శాతం వరకు అదనపు రుణం పొందే అవకాశం ఉందని తెలిపారు. పౌల్ట్రీ, పశుపోషణ రంగాలకు కూడా రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే గృహ రుణాలను పోటీ వడ్డీ రేట్లతో త్వరితగతిన మంజూరు చేస్తున్నామని చెప్పారు. చిన్న వ్యాపారులకు ప్రధానమంత్రి ముద్ర పథకం కింద రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు అర్హతను బట్టి రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. బంగారు రుణాలపై కూడా ఆకర్షణీయమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. నూతన శాఖ ప్రారంభంతో ఖాతాదారులకు మరింత వేగంగా, సులభంగా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఏజీఎం ఎల్. రామనాథన్, ఏఐపీఎన్‌బీఓఏ జనరల్ సెక్రటరీ పి. నారయ్య, అధ్యక్షుడు షేక్ గౌస్, ఏఐపీఎన్‌బీఈయూఏ ఏజీఎస్ కె. శ్రీకాంత్, కళ్యాణదుర్గం బ్రాంచ్ మేనేజర్ జి. మధులత, బ్యాంకు అధికారులు డి. కిరణ్ కుమార్, కోమలి తదితరులు పాల్గొన్నారు.
📲Get App