🔥 TRENDING ભુજ શહેર મા આજે એક ગંભીર દુર્ઘટના બનતા... Sharp Curve in Pazhayangadi Bridge Ali... Kerala Lottery Sthree Sakthi SS-547: ₹... Irfan Pathan Justifies Jofra Boult’s R... KNRUHS Launches Second Phase of PG Med... Anantapur to Host Sub-Junior National...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీపీ జీకే వీధిలో కొర్ర బాబీ బృందానికి మద్దతుగా లీల ప్రసాద్ ప్రచారం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 09:18 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎంపీపీ పూజారి లీల ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.సర్పంచ్ అభ్యర్థి కొర్ర బాబీ, మొదటి వార్డు అభ్యర్థి వంతల వరప్రసాద్, రెండో వార్డు అభ్యర్థి పూజారి గణేష్‌లకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లకు వివరించారు.
వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లీల ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
📲Get App