🔥 TRENDING ▪️ ਸਿਆਸੀ ਹੋਂਦ ਬਚਾਉਣ ਲਈ ਅਸੂਲਾਂ ਦਾ ਸੌਦਾ—... न्यू-सांगानेर रोड पर कार्रवाई से पहले... श्रावस्ती में कार्तिक पूर्णिमा पर सीता... राजस्थान में कांग्रेस पार्टी ने पंचायत... Delhi DC and Zone Chairman Raise Issue... नवादा के मधुरापुर जंगल में पुलिस की बड...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నాగమణి గెలుపే లక్ష్యంగా గిడ్డి ఈశ్వరి ఎన్నికల ప్రచారం జీకే వీధి అభివృద్ధికి కూటమి అభ్యర్థిని గెలిపించాలి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 24 Nov 2026, 09:57 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి గ్రామపంచాయతీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పసుపులేటి నాగమణి విజయానికి టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ఓటర్లను కలుసుకుంటూ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పసుపులేటి నాగమణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
📲Get App