🔥 ट्रेंडिंग नमो भारत कॉरिडोर से दिल्ली‑पनिपत‑करनाल... गवर्मेंट डिपार्टमेंट ने 5 साल के घायल... छत्तीसगढ़ में NMDC अस्पताल प्रोजेक्ट क... प्रतीभा लोने ने 532.5 किग्रा उठाकर विश... पंजाब के विधायक सभा अध्यक्ष कलतर सिंह... पंजाब में 7,000 से अधिक फ़ार्म आग, 2,1...
24 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: సీపీఎం నేత బోనంగి చిన్నయ్య పడాల్

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 24 नव. 2026, 06:44 AM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
చింతపల్లి మండల కేంద్రంలో ప్రజాశక్తి విలేకరి ఇండుగు అచ్యుతరామయ్యపై దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణమే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం అల్లూరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ పోలీసులను కోరారు.ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. విలేకరి ఇంటి సమీపంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఓ వ్యక్తి కారు ఢీకొట్టడంతో కిందపడిందని, దీనిపై ప్రశ్నించిన అచ్యుతరామయ్యతో పాటు ఆయన భార్యపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు.పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత విలేకరి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, జర్నలిస్టులు ఎలాంటి భయాందోళనలు లేకుండా విధులు నిర్వహించేలా తగిన రక్షణ కల్పించాలని బోనంగి చిన్నయ్య పడాల్ కోరారు.
📲Get App