🔥 TRENDING Speeding Vehicle Kills Army Jawan and... Alice Huang Linked to Chinese Spy Agen... Ward Boy Molests ICU Patient in Madhya... NIA Interrogates Trinamool MLA Sabina... किसान तुहर टोकन ऐप से धान विक्रय में म... Ashok Leyland Eyes Reviving Singur Aft...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

గొలుసు గుర్తుతో గెలిపించండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. ఇంటింటా ప్రచారం నిర్వహించిన కూటమి అభ్యర్థి పసుపులేటి నాగమణి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 23 Nov 2026, 01:29 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం గూడెం గ్రామంలో కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పసుపులేటి నాగమణి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం గ్రామంలోని సంతతో పాటు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు.ఈ సందర్భంగా గొలుసు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App