🔥 TRENDING साप्ताहिक समीक्षा बैठक में जिला कलेक्ट... வேலூர் புதிய பேருந்து நிலையத்தில் போக்... Punjab Congress lifts suspension of fo... Majuli Launches Northeast’s First Doub... ED Seizes Rs 70 Lakh Assets of Former... Assam to Allocate ₹4,000 Crore for Ski...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

దామనపల్లిలో వైసీపీ అధికారిక అభ్యర్థి కాసులమ్మే పార్టీ నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలు పనిచేయాలి: చంటిబాబు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 23 Nov 2026, 03:07 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
దామనపల్లి పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బలపరిచిన అధికారిక అభ్యర్థి వంతల కాసులమ్మ మాత్రమేనని చంటిబాబు స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నవారు వైసీపీ పేరు, జెండాలను ఉపయోగిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయవద్దని సూచించారు.
పార్టీ అధిష్టానం తమకు మద్దతు తెలిపిందని చెబుతున్న వారు అందుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. నిజమైన జగన్ అభిమానులు పార్టీ నిర్ణయాన్ని గౌరవించి వంతల కాసులమ్మ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గత పదేళ్లలో అభివృద్ధి చేయని నాయకులు ఇప్పుడు కొత్త హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు, అభివృద్ధి పనులు, ఇతర హామీల పేరుతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంటిబాబు కోరారు.
📲Get App