🔥 TRENDING West Bengal to Waive Govt Job Exam Fee... West Bengal Theaters Serve Only Vegeta... Patna-Varanasi Bullet Train to Cover D... Railways Runs Special Trains and Holdi... ਪਹਿਲਾਂ ਹੱਥ 'ਚ ਫੜਾਏ ਪੈਸੇ, ਫ਼ਿਰ ਵੀਡੀਓ ਬਣ... Severe Fire Ravages Timber Market Shop...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నేరేడిగొండ :నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం ఎమ్మెల్యే అనిల్ జాదవ్.

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 18 Nov 2026, 12:09 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నేరడిగొండ: మండలంలోని బంధం రేగడ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని బుధవారం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం, రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App