🔥 TRENDING केसर मिल की जमीन 41.05 करोड़ में नीलाम... मुख्यमंत्री फडणवीस यांच्या ताफ्यातील स... PM ਮੋਦੀ ਨੇ ਫਿਰ ਵਧਾਇਆ ਦੇਸ਼ ਦਾ ਮਾਣ, ਸੰਮੇ... Karnataka to Ban Tobacco Advertisement... Karnataka Considers Banning Tobacco Ad... Fraudsters Drain ₹2.80 Lakh From Accou...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి సర్పంచ్ పోరులో సీపీఎం అభ్యర్థి బుజ్జిబాబు నామినేషన్ దాఖలు.. ప్రజా సమస్యలపై పోరాటమే తన బలమని వెల్లడి

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 17 Nov 2026, 08:42 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వచ్చిన బుజ్జిబాబు ఇప్పుడు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. జీకే వీధి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం మద్దతుతో మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా తెలిపారు.నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేజర్ పంచాయతీగా ఉన్న జీకే వీధిలో ఇంకా అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు. పంచాయతీకి వచ్చే నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగించి గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.బాక్సైట్ సమస్య, అటవీ హక్కుల పట్టాల పంపిణీ, పీఎం జన్మన్ పథకం గృహ నిర్మాణ బిల్లులు, తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య సదుపాయాల కోసం 2000 సంవత్సరం నుంచి ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధిగా అవకాశం లభిస్తే స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు.గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే తన ప్రాధాన్యత అని పేర్కొంటూ, తనకు మద్దతు తెలిపి గెలిపించాలని బుజ్జిబాబు ఓటర్లను కోరారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొర్ర నీలకంఠం, గెమ్మెల పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
📲Get App