🔥 TRENDING Shreyas Iyer Leads India to 22-Run Vic... Chhath na subha wala din Cyclone Brewing in Bay of Bengal to Dr... India Clinches ODI Series Against New... Third Cyclonic Storm Alert in Weeks: U... Lakshya Sen Wins Back-to-Back Japan Ma...
16 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా. పెద్దవంగర మండలం:చిట్యాల గురుకుల పాఠశాల ఏమైంది? తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్పుపై స్పష్టత ఇవ్వాలి: మాజీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

✍️ Reporter: Bommeraboina Hareesh 🗓 16 Nov 2026, 02:15 AM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర, నవంబర్ 15: పెద్దవంగర మండలం చిట్యాల గ్రామానికి గతంలో మంజూరైన మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ గా మార్చడం పై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాలని మాజీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి కోరారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయంతో, అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో మంజూరైన గురుకుల పాఠశాలను ప్రస్తుతం తొర్రూరు లోని వాగ్దేవి కళాశాల అద్దె భవనంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. గురుకుల పాఠశాల మంజూరు తో గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రజలు ఆశించారని పేర్కొన్నారు. పాఠశాల మార్పునకు గల కారణాలు, # ప్రవేశాల విధానం, విద్యార్థులకు కల్పించే వసతులపై అధికారులు వివరించాలని కోరారు. ఉపాధ్యాయులు, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు మారకూడదని ఆమె పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఈదురు రాజేశ్వరి మాట్లాడారు..
📲Get App