🔥 TRENDING West Tripura Administration Issues War... Schools Closed Tomorrow (Nov 16, 2026)... Erratic Weather Slashes Dry‑Fruit Outp... Himachal Pradesh Pavilion Inaugurated... ग्राम प्रधान द्वारा छठ पूजा का आयोजन બોટાડમાં માવાની ખરીદીમાં ખામી, દુકાનમા...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధిలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల నిఘా.. నామినేషన్ కేంద్రాల్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 07:20 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. ఇందులో భాగంగా తహసీల్దార్ హెచ్. అన్నాజీరావు ,మండలంలోని రింతాడ, పెదవలస నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.మొదట రింతాడ కేంద్రాన్ని తనిఖీ చేసి, నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ, హెల్ప్ డెస్క్ నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం పెదవలస కేంద్రాన్ని సందర్శించి రెండు పంచాయతీల నామినేషన్ల స్వీకరణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలు, నామినేషన్ల నమోదు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు తహసీల్దార్ సూచించారు.
📲Get App