🔥 ट्रेंडिंग विराट कोहली ने गुनरूर ब्रार के एनिमेटे... एनवीडिया के सीईओ जेनसन हुआंग के अंतिम... माइक्रोसॉफ्ट आउटलुक में वैश्विक आउटेज,... माइक्रोसॉफ्ट ने वैश्विक आउटेज के बाद ऑ... शादीपुर फॉलोवर के पास हुए टकराव में दि... Khaas report mr Nazir Ahmad Sofi
13 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహిళలకు ఇచ్చిన హామీలు ఎప్పుడెప్పుడు నెరవేరుస్తారు రాహుల్ గాంధీ గారూ? – ముఖ్రా (కె) మహిళల నిరసన

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 13 नव. 2026, 11:28 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా (కె) గ్రామ మహిళలు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.

భారత్ సమిట్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ మహిళలు ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

మహిళలు గుర్తుచేసిన ప్రధాన హామీలు:

1. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం.
2. పెళ్లయిన మహిళలకు తులం బంగారం.
3. డిగ్రీ పూర్తి చేసిన యువతులకు స్కూటీలు.
4. ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15,000 రైతు భరోసా.
5. 24 గంటల త్రీఫేజ్ విద్యుత్ సరఫరా.
6. రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక సాయం.
7. వృద్ధ మహిళలకు నెలకు రూ.4,000 పింఛన్.

ఈ హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో కాంగ్రెస్ నాయకత్వం స్పష్టంగా ప్రకటించాలని ముఖ్రా (కె) గ్రామ మహిళలు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వారు కోరారు.
📲Get App