🔥 ट्रेंडिंग मुहूर्त ट्रेडिंग के साथ सेंसेक्स में 2... दक्षिण कोरियाई पीएम ने फायरफाइटर सहायत... सैयद मुश्ताक अली ट्रॉफी: त्रिपुरा ने प... हिमाचल सरकार ने कर्मचारी वेतन बकाया नि... बी.के. इंडस्ट्रीज़, पिटम्पुर ने सभी दे... हिमाचल प्रदेश के हमीरपुर बागवानी कॉलेज...
08 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రజల నమ్మకమే నా గెలుపు.. వారి సేవకే నా ప్రాధాన్యం ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును కలిసి కృతజ్ఞతలు తెలిపిన విజేత పూజారి లీలా ప్రసాద్

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 08 नव. 2026, 07:20 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జీకే వీధి 1 ఎంపీటీసీ స్థానంలో భారీ మెజారిటీతో విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజారి లీలా ప్రసాద్ ఆదివారం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ఓటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజలు ఇంతటి బాధ్యత అప్పగించడం గర్వంగా ఉందని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవకు అంకితమవుతానని పేర్కొన్నారు.ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ప్రోత్సాహం, సహకారం, ఆశీస్సుల వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. తనకు ఓటు వేసిన వారితో పాటు వేయని ప్రజలకు కూడా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు లీలా ప్రసాద్‌కు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ కొర్ర బాబి, కోఆప్షన్ సభ్యులు దావత్, రిపోర్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App