🔥 TRENDING BJP Launches ‘Save Democracy, End Anar... Indian-Origin Man in US Trial Says He... Chhattisgarh Government Announces 1,70... Mangaluru Man Loses ₹1.96 Lakh in Fake... अपोलो अस्पताल के डॉक्टर ने बताया कि सा... અનાથ પરિવાર નો સહારો એવા ધ્રાંગી પ્રતી...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జీకే వీధి జెడ్పీటీసీపై వైఎస్సార్సీపీ జెండా భారీ మెజారిటీతో కంకిపాటి గిరిప్రసాద్ విజయకేతనం

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 08 Nov 2026, 07:18 AM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గూడెం కొత్తవీధి మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కంకిపాటి గిరిప్రసాద్ తన సమీప ప్రత్యర్థులపై 7 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించిన ఆయన చివరి వరకు అదే జోరును కొనసాగించి జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.సీపీఎం అభ్యర్థి అంపురంగి బుజ్జిబాబు, జనసేన అభ్యర్థి పాంగి కృష్ణవంశీ, స్వతంత్ర అభ్యర్థి కంకిపాటి మోహనరావు పోటీలో ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ విజయంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ పార్టీ విజయానికి కారణమని వైఎస్సార్సీపీ నాయకులు పేర్కొన్నారు.
📲Get App