🔥 TRENDING सोमवार 2 नवंबर को अररिया के BRC परिसर... Health Ministry to Roll Out ‘Golden Go... Two TV Dramas: One Triumphs, One Falte... Filmibeat Releases 2026 Telugu Box Off... Mihir Ahuja Explores New Dimensions of... Harman 2x taps Punjabi heritage in new...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

బహిరంగంగా వ్యభిచారం

✍️ Reporter: TipparajuMallesh 🗓 03 Nov 2026, 06:56 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో బహిరంగంగా వ్యభిచార కార్యకలాపాల ఆరోపణలు!
పట్టించుకోని పోలీసులు.. రాత్రి వేళల్లో మహిళలు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా?
హైదరాబాద్: ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో బహిరంగంగా వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లపై కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు చేసినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయాల్లో అటుగా వెళ్లే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి!
ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు పరిసరాల్లో రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, సివిల్ డ్రెస్సులో పోలీసులతో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ప్రశ్న ఒక్కటే.. రాత్రి వేళల్లో రింగ్‌రోడ్డుపై జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న ఈ కార్యకలాపాలకు అడ్డుకట్ట ఎప్పుడు? పోలీసు ఉన్నతాధికారులు స్పందించేది ఎప్పుడు?
📲Get App