🔥 TRENDING Amit Shah Announces Rs 632 Crore DBT R... Chhattisgarh Declared Naxal-Free by Ho... Gurudaspur Records 100 Parali Burning... Delhi: Post-Mortem Conducted on Ashish... Bulldozers Demolish Properties of Cow‑... अमेठी में राजस्व निरीक्षक पर 10,000 रु...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

విధి నిర్వహణలో మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్

✍️ Reporter: Gaurav Bidkar 🗓 03 Nov 2026, 08:06 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉప్పల్ : పోలీసు విధుల్లో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప. ఎల్‌బీ నగర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టుకు చంటిబిడ్డతో విచారణకు హాజరైన బాధితురాలికి ఆమె అండగా నిలిచారు.

విచారణ సమయంలో బిడ్డను చూసుకోవడంలో తల్లి ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన కానిస్టేబుల్ దీప, ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుని తల్లిలా ఆలనాపాలనా చూశారు. దీంతో బాధితురాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించారు.

విధి నిర్వహణలో మానవీయ కోణాన్ని చాటుతూ పసిబిడ్డకు అండగా నిలిచిన దీపను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందించారు. పోలీసు సేవల్లో క్రమశిక్షణతో పాటు కరుణ, సహానుభూతి కూడా ముఖ్యమని ఆమె తన చర్యతో చాటిచెప్పారు.
📲Get App