సిరికొండ: కన్నపూర్ గ్రామంలో దండారీ వేడుకల సందడి
సిరికొండ మండలం కన్నపూర్ గ్రామంలో దండారీ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లటి వస్త్రాలతో గ్రామస్థులంతా ఒక్కటై దండారీ సంబరాల్లో పాల్గొని సందడి చేస్తున్నారు. పూర్వకాలం నుంచి వస్తున్న తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రకృతి ప్రేమికులు దీపావళి సందర్భంగా ఏటా దండారీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు.