🔥 TRENDING North vs South: Actresses Stir Debate... Three BSF Soldiers Attacked by Smuggle... BSF Opens New Pradhan Mantri Bhartiya... Tripura Completes 1,165 Cleft Lip and... बस्ती: दीपावली-छठ को लेकर पूरे जनपद मे... Congress Demands BJP Apology Over Assa...
03 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సప్పర్లలో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటా పర్యటించిన కూటమి నాయకులు

✍️ Reporter: Reporter RAJU 🗓 03 Nov 2026, 09:12 AM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సప్పర్ల గ్రామంలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా సోమవారం ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి, గాలికొండ ఎంపీటీసీ అభ్యర్థి కొర్ర కౌసల్య తరఫున బీజేపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను కలిశారు.ఈ సందర్భంగా నాయకులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి , ఎంపీటీసీ అభ్యర్థి కొర్ర కౌసల్యలకు కమలం గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పూజారి లక్ష్మణరావు, కొర్ర సూరిబాబు, పండ చిన్న, అరిమెల రాజు, ప్రభాకర్, శ్రీను తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App