🔥 TRENDING Higher education Department felicitate... सिवान में खाद्य विभाग का बड़ा एक्शन 👍... ದೇವದುರ್ಗದ ನೂತನ ರಕ್ತ ನಿಧಿ ಕೇಂದ್ರಕ್ಕೆ ಸಂ... J&k waqf board chairperson Dr Darakdh... नमो उद्यानाच्या निर्मितीसाठी ७५ लाख नि... समाजवादी पार्टी के वरिष्ठ नेता आजम खां...
02 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

బీజేపీ ప్రతిష్టాత్మక పాదయాత్రకు సర్వం సిద్ధం

✍️ Reporter: Kranthi Kumar 🗓 02 Nov 2026, 10:26 AM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్న "ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం - అరాచకవాదాన్ని అంతం చేద్దాం" నినాదంతో కూడిన మహా పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నవంబర్ 2, మధ్యాహ్నం 3:00 గంటలకు
నిజాం కాలేజీ సర్కిల్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమై
మోజంజాహీ మార్కెట్ వరకు ఈ పాదయాత్ర సాగుతుంది.
పాదయాత్ర ముగింపు దశలో మోజంజాహీ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించనున్నారు.
పాదయాత్రకు ముందు ఆయన చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ మరియు 'ఇండియా' (INDIA) కూటమి చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ (BJP) ఈ పాదయాత్రను చేపట్టింది.
ఈ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు ట్రాఫిక్ నియంత్రణ నిమిత్తం పోలీసులు తగిన ఆంక్షలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరడమైనది.
📲Get App