🔥 TRENDING Rajinikanth's 'Jailer 2' Surpasses Rs... Cockscomb Flower: The Crimson Ingredie... Rajinikanth's 'Jailer 2' Surpasses Pre... Quad Foreign Ministers Reaffirm Commit... LPG cylinder prices surge across Delhi... Three Fatalities Reported in Noney, Ma...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

కమలం గుర్తుకు ఓటేయాలని రొబ్బ పుష్పలక్ష్మి ప్రచారం ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ కూటమి అభ్యర్థికి మద్దతు కోరిన నేతలు

✍️ Reporter: Reporter RAJU 🗓 01 Nov 2026, 07:04 AM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో కూటమి బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి రొబ్బ పుష్పలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ పర్యటిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు.

ఈ సందర్భంగా బ్యాలెట్ నమూనా పత్రాలను పంపిణీ చేస్తూ, జడ్పీటీసీ ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని రొబ్బ పుష్పలక్ష్మి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి వస్తే గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App