🔥 TRENDING उळे (तालुका दक्षिण सोलापूर) येथे महावि... સુરતના પાલસાણા તાલુકામાં ટીબી મુક્ત ભા... સુરતના પલસાણા તાલુકામાં પીએમ કિસાન સન્... રાણીપ પોલીસ સ્ટેશનમાં જુગારધામ તોડ્યો,... ઇકો અને એક્ટિવા ગાડીઓનો ભયંકર અથડામણ:... Tamil Nadu Grants Five-Year Age Relaxa...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మాలిగూడలో వైఎస్సార్‌సీపీ ప్రచారం.. బొబ్బిలి లక్ష్మణ్‌కు మద్దతుగా నేతల పర్యటన ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన

✍️ Reporter: LAMMASINGI RAJU 🗓 30 Oct 2026, 09:24 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం మాలిగూడ గ్రామంలో జీకే వీధి–3 ఎంపీటీసీ అభ్యర్థి బొబ్బిలి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని లక్ష్మణ్ కోరారు.గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీపీ బోయిన కుమారి, అంజి, రాజారావు, నాయుడు, కృప, బాబీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App