🔥 TRENDING જામનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે નવા... West Bengal to Get New Industrial Poli... Former Bengal Minister Indranil Sen Ar... पडरौना में रोडवेज बस दुर्घटना, 30 से अ... New Zealand Maori Haka performed in Ra... भाजपा प्रदेश कार्यसमिति में बांसडीह वि...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

తుఫాన్ వేళ అప్రమత్తత.. దుచ్చరపాలెంలో రోడ్డుపై పడిన చెట్టు తొలగింపు ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి: జీకే వీధి ఎస్‌ఐ సురేష్

✍️ Reporter: LAMMASINGI RAJU 🗓 28 Oct 2026, 05:43 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దుచ్చరపాలెం ప్రాంతంలో రోడ్డుపై చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై స్పందించిన జీకే వీధి ఎస్‌ఐ సురేష్ చొరవతో చెట్టును తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేశారు.తుఫాన్ ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు విరిగి రహదారులపై పడే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప తుఫాన్ సమయంలో ప్రయాణాలను తగ్గించుకోవాలని, బలమైన గాలులు వీచేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని తెలిపారు.
రోడ్లపై చెట్లు లేదా ఇతర అడ్డంకులు కనిపిస్తే వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని జీకే వీధి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
📲Get App