🔥 ट्रेंडिंग बंजि बन्ना को मनोहर्पुरा में सरपंच चुन... राजस्थान जेल प्रहरी फाइनल रिजल्ट 2026... പിന്നണിയില്‍ പ്രവര്‍ത്തിച്ച സങ്കല്പ ഫ്... नवादा के कलाली मार्ग पर कचरा जमा, सफाई... तमिलनाडु के सीएम विजय 29 अक्टूबर को कै... चेन्नई में ऑटो-रिक्शा किराए में वृद्धि...
28 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ఏసీ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

✍️ रिपोर्टर: LAMMASINGI RAJU 🗓 28 अक्टू. 2026, 02:18 PM 👁 60
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి (జీకే వీధి) మండలంలోని ఎర్రవారం, ఆర్.వి. నగర్ గ్రామాల్లో ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జీకే వీధి–3 ఎంపీటీసీ అభ్యర్థి శెట్టి నారేశ్వరరావుకు మద్దతుగా స్థానికులు, అభిమానులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.“మంచి నాయకుడు మాటలతో కాదు.. చేతలతో నిరూపించుకోవాలి” అనే నినాదంతో అభ్యర్థి మద్దతుదారులు ప్రజలను కలుస్తూ ప్రచారం చేపట్టారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శెట్టి నారేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.ఎన్నికల్లో బ్యాలెట్ నంబర్‌ 3లో ఉన్న ఎయిర్ కండీషనర్ (ఏసీ) గుర్తుపై ఓటు వేసి శెట్టి నారేశ్వరరావును గెలిపించాలని ప్రచారకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుండటంతో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది.
📲Get App