ఆదిలాబాద్ భీంపూర్: అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యల పరంపర ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. 3 రోజుల క్రితం తలమడుగులో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవకముందే భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన పసుల ఆశన్న(50) అనే రైతు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.