🔥 TRENDING समस्तीपुर को मिली दो महत्वपूर्ण ROB पर... ટ્રકનું અકસ્માત, બે વ્યક્તિઓને ઈજા HAL to launch Shakti engine production... IMPCC Odisha Holds Strategic Communica... Congress Protesters Burn CEC Gyanesh K... एसपी अभिनव धिमान ने नवादा में अपराध नि...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆహ్వానం

✍️ Reporter: Shaik Abdul Rahiman 🗓 06 Oct 2026, 11:14 PM 👁 10
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కడప నగరంలోని ప్రసిద్ధ అమీన్ పీర్ సాహెబ్ దర్గా పీఠాధిపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 2026 అక్టోబర్ 25న జరగనున్న ఉరుసు మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, భక్తులకు అవసరమైన వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

కడప నగరంలోని ప్రసిద్ధ అమీన్ పీర్ సాహెబ్ గారి దర్గా (పెద్ద దర్గా) పీఠాధిపతులు గౌరవనీయులు కే ఎస్ ఎస్ ఆరిఫుల్లా హుస్సేని గారు మరియు వారి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా 2026 అక్టోబర్ 25వ తేదీన జరగనున్న పెద్ద దర్గా ఉరుసు గంధం ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందిస్తూ, పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలకు హాజరయ్యేందుకు తప్పక ప్రయత్నం చేస్తానని తెలిపారు.

అదే సందర్భంగా అక్కడే ఉన్న కడప జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారితో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా తదితర సదుపాయాలను సమకూర్చాలని, సంబంధిత శాఖలకు వెంటనే తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఉరుసు మహోత్సవాల వైభవం కడప నగరమంతా ప్రతిబింబించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

గత రెండు సంవత్సరాలుగా కడప ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవి రెడ్డి గారు, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారి సహకారాలతో పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతో, ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి అన్న గారి సహకారంతో, జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కడప నగరానికి ఆధ్యాత్మికంగా, చారిత్రకంగా ఎంతో ప్రత్యేకతను తీసుకువచ్చే పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు, భక్తులు కలసి ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారు.
📲Get App