ఆదిలాబాద్: అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు
అక్టోబర్ రెండో వారంలో సీసీఐ, ప్రైవేట్ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. జిన్నింగ్ మిల్లుల వివరాలను యాప్లో నమోదు చేసి, రైతులను సంబంధిత మిల్లులకు ట్యాగింగ్ చేసే ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. అదేవిధంగా మార్కెట్ యార్డుల్లో తూకం, షెడ్లు, నీరు తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు.