ఆదిలాబాద్ రాధా కృష్ణ రూపంలో దర్శనమిస్తున్న గణపతి
यहाँ देखें:
📘 Facebook
జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ శ్రీ బాలగోపాల అక్షిత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గణనాథుడిని రాధా-కృష్ణుల రూపంలో అత్యంత మనోహరంగా అలంకరించి ప్రతిష్ఠించారు.
రాధా-కృష్ణుల రూపంలో దర్శనమిస్తున్న లంబోధరుడి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నయనమనోహర దృశ్యాలను తిలకించేందుకు కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక అలంకరణతో కొలువుదీరిన గణనాథుడిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.