🔥 TRENDING बारिश से बरेली के भोजीपुरा में पशु चार... नसीराबाद में वीर तेजा महाराज मेले में... Himachal Governor Urges Respect for In... 7-Year-Old Child Dies in Jalandhar Hos... Excise Raid in Jalandhar Seizes Three... Jamui Police Arrest Molestation Suspec...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ ఘటనపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆగ్రహం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 12:32 PM 👁 50
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. చిన్నారులు, వారి తల్లిదండ్రులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రిలోనే ప్రాణాలు పోతున్నాయి. చిన్నారుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అని అన్నారు. రిమ్స్‌లో పర్యవేక్షణ లోపించిందని ఆరోపించారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు.
📲Get App