🔥 TRENDING लखनऊ: उत्तर प्रदेश शिक्षा सेवा चयन आयो... टोंक: जिला कलेक्टर टीना डाबी के निर्दे... సిరికొండ: మండల కేంద్రంలోని యువ చైతన్య... ABVP protests security arrangements at... ABVP rallies at JNU demanding tighter... Transgender man, 50, drowns while bath...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పర్యవేక్షణ లోపంతోనే ప్రమాదం: ఉయిక విష్ణు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 10:54 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఎస్ఎన్సీయూ వార్డులో ఏసీ పేలి ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందిన ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఉయిక విష్ణు ఆరోపించారు. రిమ్స్‌లో సమస్యలు పేరుకుపోయినా వాటి పరిష్కారంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
అధికారుల పర్యవేక్షణ లోపం, నాసిరకం పరికరాల వినియోగం, అవినీతి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉయిక విష్ణు డిమాండ్ చేశారు.
📲Get App