🔥 TRENDING Aguada Sand Bar Reopens to Marine Traf... गुजेर समाज ने तेजा जी महाराज की बिदोरी... Madhya Pradesh Says Goodbye to Monsoon Astrologer Karan Sharma Receives Honor... Cine1 Studios Debuts in Tamil Cinema w... Netflix's 'Gandhari' Tops Indian Strea...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం కృషి

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 07:23 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
19న కోదాడలో మెగా జాబ్ మేళా : మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి

యువతకు ఉపాధి

నిరుద్యోగ కల్పించేందుకు నిరంతర కృషి అవసరమని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగం నేడు మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో ఒకటని తెలిపారు. సోమవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యావంతులైన యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల సమష్టి బాధ్యత అని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య ఒక్కరోజులో లేదా ఒక్క జాబ్ మేళాతో పూర్తిగా పరిష్కారం కాదని స్పష్టం చేశారు. యువత విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిరంతర, ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతను నియామక సంస్థలతో నేరుగా అనుసంధానం చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు.తన 32 ఏళ్ల ప్రజాజీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, టీపీసీసీ అధ్యక్షుడిగా సాధ్యమైనంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేశానని తెలిపారు. ఈ నెల 19వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్ స్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని, అవసరమైన ఆర్థిక సహాయాన్ని సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధుల ద్వారా అందిస్తుందని తెలిపారు.2025 అక్టోబర్లో నిర్వహించిన హుజూర్నగర్ మెగా జాబ్ మేళాకు దాదాపు 40 వేల మంది నమోదు చేసుకోగా, 20,463 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని గుర్తుచేశారు. వారిలో 2,041 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, మరో 1,533 మంది తదుపరి నియామకాల కోసం షార్ట్ లిస్ట్ అయ్యారని తెలిపారు. మొత్తం 3,574 మంది యువతకు ప్రత్యక్షంగా లేదా భవిష్యత్తులో ఉపాధి పొందే అవకాశం లభించిందన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డి కన్వీనర్ గా జాబ్ మేళా నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అభ్యర్థుల నమోదు, కంపెనీల భాగస్వామ్యం, ప్రచారం, ఇంటర్వ్యూ సదుపాయాలు, రవాణా, భద్రత, ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లను కమిటీ సమన్వయం చేస్తుందని పేర్కొన్నారు. . నిర్వహణ కమిటీ తొలి సమావేశం ఈ నెల 10న సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో జరుగుతుందని వెల్లడించారు.
📲Get App