🔥 TRENDING జీకే వీధి సర్పంచ్ బరిలో టీడీపీ అభ్యర్థ... Delhi’s AQI hits ‘very poor’ level of... Delhi Air Quality Plummets, IIT Delhi... India Rejects UN Moratorium Linking Ju... Chhath Puja 2026: Sandhya Arghya Timin... SpaceX pulls off first-ever spaceship...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఏజెన్సీ విద్యార్థి విజయ ప్రస్థానం.. రాష్ట్రపతి భవన్ వేడుకలకు చిన్నబాబుకు ఆహ్వానం! 92.4 శాతం మార్కులతో విద్యా ప్రతిభ.. మారుమూల గిరిజన గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు

✍️ Reporter: Reporter Lammasingi Raju 🗓 15 Nov 2026, 07:29 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతానికి చెందిన మెట్టపాటి చిన్నబాబుకు అరుదైన గౌరవం దక్కింది. జనజాతీయ గౌరవ దివస్‌ను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ప్రత్యేక వేడుకల్లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన విద్యార్థికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం స్థానికంగా ఆనందం కలిగిస్తోంది.జీకే వీధి మండలం వంచుల పంచాయతీ కొత్తపాలెం గ్రామానికి చెందిన స్వర్గీయ బుజ్జిబాబు, పార్వతమ్మ దంపతుల కుమారుడైన చిన్నబాబు స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకున్నారు. హ్యూమానిటీస్ విభాగంలో 92.4 శాతం మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ విద్యా ప్రతిభకు గుర్తింపుగా రాష్ట్రపతి భవన్ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించింది.సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయి కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం విశేషంగా నిలిచింది. చిన్నబాబు సాధించిన ఈ గుర్తింపు ఏజెన్సీ ప్రాంతంలోని ఇతర విద్యార్థులకు సైతం స్ఫూర్తినిస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఈ సందర్భంగా రమణ మాస్టారు, ముర్ల భూపతి, కొత్తపాలెం గ్రామస్థులు చిన్నబాబును అభినందించారు. ఆయన విద్యాభివృద్ధికి సహకరించిన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
📲Get App