🔥 TRENDING O.M Operation Mole Reports Day 2 Box O... Box Office Collection of 'Scene' on Da... भोंगवलीत सबस्टेशन आणि टॉवर लाईनविरोधात... Meghalaya Indigenous Potatoes Outperfo... मुरादाबाद में ट्रेन के जनरल कोच में मा... Ramayana grosses ₹1,616 crore in 17 da...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రూ. 50 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Nov 2026, 12:33 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
రూ. 50 లక్షలతో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నెరడిగొండ మండల కేంద్రాన్ని అన్ని వసతులతో అభివృద్ధి చేస్తాం
నెరడిగొండ: మండల కేంద్రంలోని విజయ్ రెడ్డి కాలనీలో రూ. 50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలోనే నెరడిగొండను సీసీ రోడ్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, సాబ్లే సంతోష్, సుజీల్, అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App