🔥 TRENDING Salman Khan's Maatrubhumi Trailer Sets... Super Troopers 3 launches on Disney+ w... Car Plunges into Ditch in Uttarkashi,... Uttarakhand CM Pushkar Singh Dhami rai... Magnitude 2.9 quake rattles Faridabad,... Magnitude 2.9 Earthquake Shakes Parts...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

రూ.325తో రోజంతా అన్‌లిమిటెడ్ జర్నీ..!

✍️ Reporter: Kranthi Kumar 🗓 06 Nov 2026, 02:33 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు మెట్రో రైలు, ఆర్టీసీ యాజమాన్యాలు తీపికబురు అందించనున్నాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు పరిధిలోని కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ ప్రాంతంలో మెట్రో రైళ్లు, ‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్‌ ధరలను భారీగా తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణికులపై అధిక భారం మోపుతున్న పాస్‌ ధరలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా రోజువారీ ఉమ్మడి పాస్‌ ధరను రూ.400 నుంచి రూ.325కు, నెలవారీ పాస్‌ ధరను రూ.8,500 నుంచి రూ.4 వేల లేదా రూ.4,500కు తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ధరలు అమల్లోకి వస్తే నెలవారీ పాస్‌పై దాదాపు సగం భారం తగ్గనుంది.
📲Get App