🔥 TRENDING ৫ নভেম্বর নতুন শিল্পনীতি প্রকাশ, ৫০ লক... સુરતમાં ટ્રાફિક ટ્રેપ કેસમાં બે આરોપીઓ... Delhi Police Arrest Youth in MCOCA Cas... Two masked gunmen fire at Dubai busine... Youth Congress Activists Protest on Ro... रबी सीजन 2026-27: किसानों को सुगमता से...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

3 వ టీ 20 లో న్యూజిలాండ్ పై భారత్ విజయం. సిరీస్ 3-0 కైవసం.

✍️ Reporter: T Kranthi Kumar 🗓 28 Oct 2026, 08:37 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మంగళవారం ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరిగిన 3 వ టీ20 లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ త్వరగానే మొదటి వికెట్ కోల్పోయింది. తర్వాత ఫిన్ అలెన్ 25 బంతుల్లో 48 పరుగులు, జాకబ్స్ 23 బంతుల్లో 39 పరుగులు, డారల్ మిచెల్ 52 బంతుల్లో 89 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో అర్షదీప్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఒక్కొక్క వికెట్ తీశారు.
తర్వాత లక్ష్య ఛేదన లో బ్యాటింగ్ దిగిన భారత్ జట్టు న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి అరేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులు, సూర్యవంశీ 19 బంతుల్లో 48 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ 18, శ్రేయాస్ అయ్యర్ 5, తిలక్ వర్మ (1) నాట్ అవుట్, నమన్ ధీర్ 4 పరుగులు నాట్ అవుట్ గా నిలిచి కేవలం 13.2 ఓవర్ల లో 4 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి 5 మ్యాచ్-ల సిరీస్-లో 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్-లో పలు రికార్డు లు నమోదు అయ్యాయి.మొదటిది పవర్ ప్లే లో కేవలం 6 ఓవర్ల లలో 118 పరుగుల చేసి అంతర్జాతీయ పురుషుల T20 క్రికెట్ చరిత్రలోనే పవర్ ప్లే లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా ఇండియా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. రెండవది అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో నే సెంచరీ చేసి భారతీయులలో రెండవ అత్యంత వేగవంతమైన T20 సెంచరీ నమోదు చేశారు.
📲Get App