🔥 ट्रेंडिंग शेरपुर‑सूरौठ पंचायत समिति में ग्रामीणो... महाराष्ट्र की राजनीति में शिंदे, पवार,... सूरौठ में 60 हज़ार रुपये से अधिक वार्ष... जिला कलेक्टर करौली और पुलिस अधीक्षक ने... सैयद मुस्तफ़ अली ट्रॉफी में उत्तर प्रद... गोरखपुर जाने वाली ट्रेन के चार कोच कान...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ.. చిన్నారుల వికాసంపై ప్రత్యేక దృష్టి! జీకే వీధిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పీబీపీబీ ఫేజ్–2 శిక్షణ విజయవంతం

✍️ रिपोर्टर: Reporter Lammasingi Raju 🗓 12 नव. 2026, 07:05 AM 👁 15
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మెరుగైన ఆరోగ్య, పోషకాహార సేవలు అందించడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా జీకే వీధి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల పీబీపీబీ ఫేజ్2 శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ శిక్షణలో అంగన్‌వాడీ సిబ్బందికి చిన్నారుల సంపూర్ణ వికాసానికి అవసరమైన బోధనా పద్ధతులు, ఆటపాటల ద్వారా అభ్యసన సామర్థ్యాల పెంపు, బాలల భద్రత, పరిశుభ్రత, హక్కులపై అవగాహన కల్పించారు. ఆధారశిల కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో భాషా, సంఖ్యా పరిజ్ఞానం, సృజనాత్మకతను పెంపొందించే అంశాలను వివరించారు.అలాగే పోషణ్ ట్రాకర్ యాప్ వినియోగం, లబ్ధిదారుల నమోదు, చిన్నారుల ఎత్తు, బరువు కొలతలు, ఎదుగుదల పర్యవేక్షణ, రక్తహీనత నివారణ, తల్లిపాల ప్రాముఖ్యత వంటి అంశాలపై శిక్షణ అందించారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ (ఎఫ్‌ఏసీ) డి.వలసమ్మ, సూపర్‌వైజర్లు డి.మోహిని, ఎల్‌.ఎస్‌. మాలతీదేవి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ ద్వారా అంగన్‌వాడీ సేవల్లో నాణ్యత పెరిగి, చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మరింత దోహదపడుతుందని వారు పేర్కొన్నారు.
📲Get App